ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రత్యర్థులు గెలిచిన చోట వాలంటీర్ల తొలగింపు! - ఆంధ్రప్రదేశ్ న్యూస్ అప్​డేట్స్

తెదేపా మద్దతుదారులు గెలిచిన చోట గ్రామ వాలంటీర్లను విధుల నుంచి తొలగించడం చర్చనీయాంశమైంది. ప్రకాశం జిల్లా అద్దంకి మండల పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

volunteers
volunteers

By

Published : Feb 24, 2021, 8:49 AM IST

ప్రకాశం జిల్లా అద్దంకి మండల పరిధిలో.. తెదేపా మద్దతుదారులు గెలిచిన చోట గ్రామ వాలంటీర్లను విధుల నుంచి తొలగించడం చర్చనీయాంశమైంది. రెండో విడతలో ఇక్కడ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. పలు చోట్ల తెదేపా సానుభూతిపరులు విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ధేనువకొండ పంచాయతీ పరిధిలో ఏడుగురు, మోదేపల్లిలో ముగ్గురు వాలంటీర్లను తొలగిస్తూ ఎంపీడీవో రాజేందర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నెల 17వ తేదీతో ఉత్తర్వులు ఉండగా.. వాటిని ఆయా వాలంటీర్లకు మంగళవారం అందజేశారు. మరికొన్ని పంచాయతీల పరిధిలో మరో 25 మంది వాలంటీర్లను తొలగించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై ఎంపీడీవోను వివరణ కోరగా... పని తీరు బాగా లేనందువల్లే వారిని తొలగించాల్సి వచ్చిందన్నారు. ఆ మేరకు వారితో ముందుగానే చర్చించగా స్వచ్ఛందంగా రాజీనామా చేస్తామని ముందుకు వచ్చారన్నారు. గ్రామాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు సక్రమంగా అమలు చేసేందుకు చురుకైన వాలంటీర్లు అవసరమన్నారు. అంతకు మించి వారి తొలగింపులో మరెలాంటి ఉద్దేశం లేదన్నారు.

ఇదీ చదవండి:అగ్రవర్ణ పేదలకు గుడ్​ న్యూస్... 'ఈబీసీ నేస్తం'కు కేబినెట్‌ ఆమోదం

ABOUT THE AUTHOR

...view details