ఆర్టీసీ డిపో యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ.. ఏపీపీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా చీరాలలో రిలే దీక్షలు చేపట్టారు. చీరాల డిపో నుంచి ఒంగోలుకు బైపాస్ రైడర్లను కుందించడం వలన ఆదాయం తగ్గిందని.. ఏఐటీయుసీ నాయకులు బత్తుల శామ్యూల్ అన్నారు.
చీరాల బస్టాండ్లో తాగునీరు ఉన్న.. అపరిశుభ్రంగా ఉండి.. తాగటానికి పనికి రాకుండా ఉందన్నారు. బస్టాండ్లో సమస్యలు పేరుకుపోయి ఉన్నాయని.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వలన సమస్యలు తగ్గుతాయని భావిస్తే.. ఎక్కువయ్యాయన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం ఈ సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలన్నారు.