కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రకాశం జిల్లా చీరాలలో ఇబ్బందులు పడుతున్న దివ్యాంగులకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు అందచేశారు. రామకృష్ణాపురంలో దివ్యాoగుల కుటుంబాలకు గురుదత్త ఇండ్రస్ట్రీస్ వారి చేయూతతో నిత్యావసర సరుకులు, బియ్యాన్ని చీరాల రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ జి. సుబ్బారావు , సెక్రటరీ ఎన్. జయప్రకాష్, డి. డేవిడ్ రాజు పంపిణీ చేశారు.
నిత్యావసరాలు పంచిన రెడ్ క్రాస్ సభ్యులు - corona case in prakasam dst
ప్రకాశం జిల్లా చీరాలలో దివ్యాంగులకు రెడ్ క్రాస్ సభ్యులు నిత్యావసరాలు పంపిణీ చేశారు. లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలను కొంతవరకైనా తీర్చాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నట్లు ఛైర్మన్ సుబ్బారావు తెలిపారు.
నిత్యావసరాలు పంచిన రెడ్ క్రాస్ సభ్యులు