ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"రామ.. రామ.." దేవుడి విగ్రహ ప్రతిష్ఠలో.. రికార్డింగ్ డ్యాన్సులు!

ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ అంటే.. ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహిస్తారు.. వేద పండితుల మంత్రోచ్ఛరణలు మార్మోగుతుంటాయి.. కానీ.. అక్కడ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా.. సినిమా పాటలు మోతెక్కిపోయాయి.. అమ్మాయిలు రికార్డింగ్ డ్యాన్సులతో హోరెత్తించారు. మంత్రాలు, భక్తి పాటాలు వినిపించాల్సిన చోట.. ఐటెంసాంగ్​లతో రెచ్చిపోయారు. ఇంతకీ ఇదంతా ఎక్కడో తెలుసా..?

By

Published : May 29, 2022, 9:44 PM IST

రికార్డింగ్ డ్యాన్సు​లు
రికార్డింగ్ డ్యాన్సులు

ప్రకాశం జిల్లాలోని కంభం మండలం నడింపల్లి గ్రామంలో రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేశారు. అధికార పార్టీ నేతల అండదండలతో ఈ రికార్డింగ్ డాన్సులను ఏర్పాటు చేశారని పలువురు ఆరోపించారు. భక్తి పాటలు వినిపించాల్సిన చోట.. ఐటెంసాంగ్​లు, డీజీ పాటల మోత మోగటంతో నిజమైన భక్తులు మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా.. పోలీసులు అటువైపు కన్నెత్తి చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిదానికి రూల్స్, పర్మిషన్స్ మాట్లాడే పోలీసులు.. ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నిస్తున్నారు.

విగ్రహ ప్రతిష్ఠలో.. రికార్డింగ్ డ్యాన్సులు

ABOUT THE AUTHOR

...view details