ప్రకాశం జిల్లా దర్శిలో పొదిలిరోడ్డు, కురిచేడురోడ్డులో గల రైస్ మిల్లుల్లో పోలీసులు దాడులు చేశారు...రీసైక్లింగ్ చేసి పంపిణీకి సిద్ధంగా ఉంచిన పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం బస్తాలు చూసి పోలీసులు,అధికారులు అవాక్కయ్యారు.
ఒక్క దర్శిలోనే రెండు రైస్ మిల్లుల్లో సుమారు 2000 బస్తాలు పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ బియ్యాన్ని రైస్ మిల్లుల్లో రీసైకిలింగ్ చేసి ఆఫ్రికా, సింగపూర్, మలేషియాకు ఎగుమతి చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.