ప్రకాశం చీరాల మున్సిపాలిటీలో రెబల్స్ హవా కొనసాగింది. అధికార వైకాపాకు వారు చెమటలు పట్టించారు. 33 స్థానాల్లో ఏకంగా 11 చోట్ల రెబల్స్ విజయం సాధించారు. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రెబల్స్‌కు నేతృత్వం వహించారు. మొత్తం 30 స్థానాల్లో ఆమంచి వర్గీయులు పోటీ చేయగా.. 11మందిని విజయం వరించింది. వైకాపా 18 స్థానాల్లో గెలుపొంది మున్సిపాలిటీని దక్కించుకుంది. తెదేపా ఓ చోట విజయ సాధించింది.
ఆమంచిని కలిసిన రెబల్ అభ్యర్థులు..