ప్రకాశం జిల్లా చీరాల పురపాలక ఎన్నికల్లో రెబల్ అభ్యర్థులతో అధికార పార్టీ నేతలు సతమతమవుతున్నారు. ఓ వైపు ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి ప్రచారం చేస్తుండగా... వీరికి పోటీగా రెబల్ అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తికి వైకాపా అధిష్టానం బీ-ఫారాలు ఇవ్వటంతో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులు రెబల్స్‌గా పురపోరులో నిలిచారు. సేవ్ చీరాల-సేవ్ వైసీపీ అంటూ నినాదాలు చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు.
చీరాలలో హోరెత్తిన ప్రచారం... వైకాపా రెబల్స్‌తో వేడెక్కిన రాజకీయం - election campaigning in chirala prakasam district
ప్రకాశం జిల్లా చీరాలలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ ఎన్నికల్లో అధికార వైకాపా అభ్యర్థులు రెబల్ అభ్యర్థులతో అవస్థలు పడుతున్నారు. 'సేవ్ చీరాల-సేవ్ వైసీపీ' అంటూ ప్రచారం చేస్తూ మందుకు సాగుతున్నారు.
చీరాలలో హోరెత్తిన ప్రచారం