ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో తొలి విడత పోలింగ్​కు సర్వం సిద్ధం - first phase polling in Prakasam

ప్రకాశం జిల్లా తొలి విడత స్థానిక ఎన్నికల పోరుకు సర్వం సిద్ధమైంది. ఒంగోలు డివిజన్‌లో 192 పంచాయితీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

first phase polling in Prakasam
ప్రకాశం జిల్లాలో తొలి విడత పోలింగ్ సర్వం సిద్ధం

By

Published : Feb 8, 2021, 6:35 PM IST

ప్రకాశం జిల్లా తొలి విడత స్థానిక ఎన్నికల పోరుకు సర్వం సిద్ధమైంది. ఒంగోలు డివిజన్‌లోని 14 మండలాల్లో 192 పంచాయితీల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. డివిజన్​లో మొత్తం 229 పంచాయితీలకు తొలి విడత ఎన్నికల కోసం ఎస్​ఈసీ నోటిఫికేషన్‌ జారీ చేయగా కోర్టు కారణాల వల్ల రెండు పంచాయితీల్లో ఎన్నికలను రద్దు చేశారు. 35 పంచాయితీల్లో సర్పంచ్, 762 వార్డు పదవులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 192 పంచాయితీల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు పటిష్ఠ నిఘా ఏర్పాట్లు చేశారు.

చీరాల నియోజకవర్గంలో కోర్టు వివాదం కారణంగా చీరాల మండలం పూర్తిగా, వేటపాలెంలో రామన్నపేట మినహా మిగతా పంచాయితీలకు ఎన్నికలు రద్దు చేశారు. రామన్న పేటలో కూడా సర్పంచి పదవికి ఏకగ్రీవం కావడం వల్ల అక్కడ వార్డులకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. ఏకగ్రీవాలు అయిన పంచాయితీల్లో ఎక్కువగా వైకాపా మద్దతుదారులకే అవకాశాలు దక్కాయి. కొన్ని చోట్ల తెదేపా నుంచి వైకాపాలో చేరి సర్పంచులుగా ఎన్నికైనవాళ్లు సైతం ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details