ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని కొవిడ్ కేర్ సెంటర్‌ను ఆర్టీవో శేషిరెడ్డి పరిశీలించారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించడం కోసం కొవిడ్ కేంద్రాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. కరోనా వ్యాప్తి పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కొవిడ్ నిర్ధారణ అయి ఇంట్లో ఉండడానికి అవకాశం లేని వారి కోసం ఈ కేంద్రాన్ని ప్రారంభించామని వివరించారు. రేపటి నుంచి కొవిడ్ సెంటర్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. కొవిడ్ కేర్ సెంటర్లో ఉన్నవారికి ప్రభుత్వం ఇచ్చిన మెనూ ప్రకారం ఆల్పాహారము, భోజనం అందించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
'కొవిడ్ కేర్ సెంటర్లలో మెరుగైన వైద్య సేవలు' - ఆర్టీవో శేషిరెడ్డి కొవిడ్ కేర్ కేంద్రాన్ని సందర్శన
కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు... కేర్ సెంటర్లను ఏర్పాట్లు చేసినట్లు ఆర్డీవో శేషిరెడ్డి తెలిపారు. యర్రగొండపాలెం యూత్ ట్రైనింగ్ సెంటర్ బిల్డింగ్‌లోని కొవిడ్ కేర్ సెంటర్‌ను ఆయన పరిశీలించారు.
!['కొవిడ్ కేర్ సెంటర్లలో మెరుగైన వైద్య సేవలు' rdo](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11583406-362-11583406-1619704115286.jpg)
rdo
Last Updated : Apr 29, 2021, 8:41 PM IST