RODENTS DESTROY MONEY : ప్రకాశం జిల్లాలోని అగస్టిన్ అనే మధ్యతరగతి రైతు.. పొలం పెట్టుబడులకు, కోడలి ప్రసవ ఖర్చుల కోసం ఓ వ్యక్తి దగ్గర రూ.70వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బును జాగత్రగా ఇంటికి తీసుకొచ్చి.. అంతే జాగ్రత్తగా చెక్కపెట్టెలో భద్రపరిచాడు. రెండు రోజుల తర్వాత చెక్కపెట్టెలో ఉన్న డబ్బును భార్యను తీసుకురమ్మనగా.. తాళం తీసి చూసిన ఆమె విస్మయానికి గురైంది. కారణం.. అవి ముక్కలు ముక్కలుగా ఉండడం. ఆ చినిగిపోయిన ముక్కలనే తీసుకెళ్లి భర్త చేతిలో పెట్టింది. అది చూసిన అగస్టిన్ బోరున విలపించాడు.
అప్పుగా తెచ్చుకున్న డబ్బు.. ముక్కలు ముక్కలైన నోట్లు.. ఏం జరిగింది..? - డబ్బు నాశనం చేసిన ఎలుకలు
RATS DESTROY MONEY : ఓ సామాన్య రైతు.. తన కుటుంబ అవసరాల కోసం ఓ షావుకారి దగ్గర కొంత మొత్తంలో డబ్బును అప్పుగా తీసుకున్నాడు. ఆ తర్వాత ఇంటికొచ్చి చెక్కపెట్టెలో జాగత్త్రగా దాచిపెట్టాడు. రెండు రోజుల తర్వాత చూస్తే అవి ముక్కలు ముక్కలుగా కనిపించాయి. దీనికంతటికి కారణం తెలిస్తే మీరూ ఆశ్చర్యపోతారు. మరి తెలుసుకోవాలనుందా.. అయితే ఇది చదవండి..
RODENTS DESTROY MONEY
అప్పుగా తీసుకున్న డబ్బు ఇలా ముక్కలు ముక్కలు కావడం.. తన కోడలికి ప్రసవం దగ్గర పడుతుండడంతో ఏమి చేయాలో తెలియక గుండెలవిసేలా రోదిస్తున్నాడు. ఇంతకీ ఆ డబ్బులు ఏలా ముక్కలు అయ్యాయో చెప్పలేదు కదా.. ఎవరంటే మూషికరాజు. అవును మీరు విన్నది నిజమే.. ఈ పని చేసింది ఎలుకలే.. ఈ ఘటన జిల్లాలోని ముండ్లమూరు మండలం బృందావనం కాలనీలో జరిగింది.
ఇవీ చదవండి: