ప్రకాశం జిల్లా పర్చూరు మండలం నూతలపాడులో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని గ్రామస్థులు, వాలంటీర్ల పట్టుకున్నారు. నూతలపాడులోని ఒక ఇంటి నుంచి రేషన్ బియ్యం అక్రమంగా వాహనంలో తరలిస్తున్నారనే సమాచారంతో అప్రమత్తమయ్యారు. వాలంటీర్లు ఆ ఇంటికి వెళ్లారు. అధిక సంఖ్యలో నిల్వచేసిన రేషన్ బియ్యం గుర్తించారు. వాటిని తరలించటానికి ఒక పాలవ్యాను సిద్ధంగా ఉందన్నారు. ఆ ఇంటికి తాళంవేసి అధికారులకు సమాచారం ఇచ్చారు.
చౌక బియ్యాన్ని అక్రమంగా నిలువ చేసిన ఇంటికి.. వాలంటీర్ల తాళం - prakasam dst ratio rice news
అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని ప్రకాశం జిల్లా పర్చూరు మండలం నూతలపాడులో వాలంటీర్లు, గ్రామస్థులు పట్టుకున్నారు. రేషన్ బియ్యం నిలువ చేసిన ఇంటికి తాళం వేసి అధికారులకు సమాచారం ఇచ్చారు.
ration rice storage founded in prakasam dst by ward volunteers