ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో వైభవంగా రథసప్తమి వేడుకలు - ongole district latest updates

ప్రకాశం జిల్లాలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. కనిగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం, మార్కాపురం శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం, ఒంగోలులోని పలు దేవాలయాల్లో ఊరేగింపు నిర్వహించారు.

ratha sapthami in ongole district
ప్రకాశం జిల్లా వైభవంగా రథసప్తమి వేడుకలు

By

Published : Feb 1, 2020, 9:49 PM IST

కనిగిరి

ప్రకాశం జిల్లా కనిగిరిలో రథసప్తమిని పురస్కరించుకుని స్థానిక వెంకటేశ్వర దేవస్థానంలో వైభవంగా జరిపారు. ఈ వేడుకల్లో భాగంగా ఏడు రథాలైన సూర్యప్రభ వాహనం, గరుడ వాహనం, పెద్ద శేష వాహనం, చిన్న శేష వాహనం, కల్పవృక్ష వాహనం, చంద్రప్రభ వాహనం, హనుమత్ వాహనాలపై శ్రీదేవి, భూదేవి సమేతగా స్వామివారిని కనిగిరి పురవీధుల్లో ఊరేగించారు.

మార్కాపురం

మార్కాపురంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం సూర్య వాహనం మొదలుకొని... రాత్రి చంద్రప్రభ వాహనం వరకు సప్త వాహనాలపై స్వామి ఊరేగారు. సాయంత్రం స్వామి వారు వెండి రథంపై భక్తులకు దర్శనమిచ్చారు.

ఒంగోలు

ఒంగోలులోని పలు దేవాలయాల్లోని రథసప్తమి వేడుకలు జరిగాయి. గాంధీ రోడ్డులో సూర్యభగవానులను ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ప్రతీ ఏటా నిర్వహిస్తున్నట్గుగానే ఈ ఏడాది కూడా సూర్య నమస్కారాలు నిర్వహించారు. పతంజలి యోగా శిక్షణాలయం ఆధ్వర్యంలో జరిపిన సామూహిక సూర్యనమస్కారాల్లో పిల్లలు, మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ఇదీ చదవండి :

రథసప్తమి విశిష్టత ఇదే

ABOUT THE AUTHOR

...view details