మతి స్థిమితం లేని యువతిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం రాజుపాలెంలో ఈ దారుణం జరిగింది. రాత్రి ఇంట్లో నిద్రపోతున్న యువతిపై అత్యాచారం చేసినట్లు బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. యువతి కేకలు వేయగా... బంధువులు నిందితున్ని పట్టుకున్నారు. అప్రమత్తమైన నిందితుడు అక్కడినుంచి తప్పించుకున్నాడు. బాధితురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం యువతిని మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
మతి స్థిమితం లేని యువతిపై అత్యాచారం - Rape on a young woman at thripuranthakam newsupdates
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అత్యాచార ఘటనలు మరవకముందే... రాష్ట్రంలో మరోకటి జరిగింది. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో మతిస్థిమితం లేని యువతిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
మతి స్థిమితం లేని యువతిపై అత్యాచారం