ప్రకాశం జిల్లా ఒంగోలు శర్మ కళాశాల మైదానంలో ఆంధ్ర, దిల్లీ జట్ల మధ్య రంజీ మ్యాచ్ ఆసక్తిగా జరుగుతోంది. మూడోరోజు ఆట కొనసాగించిన ఆంధ్ర జట్టు 127 ఓవర్లలో 368 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రెండో రోజు 70 పరుగులతో క్రీజులో ఉన్న రికీ భుయ్ శతకంతో అదరగొట్టాడు. అద్భుతమైన షాట్స్‌తో 313 బంతుల్లో 15 బౌండరీలు, 4 సిక్స్‌ల సాయంతో 144 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఆంధ్ర జట్టు 153 పరుగుల ఆధిక్యం సాధించింది. దిల్లీ బౌలర్లలో నవదీప్ సైనీ 86 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్సింగ్స్ ఆరంభించిన దిల్లీ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 28 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. ఆంధ్ర బౌలర్ స్టీఫెన్ 47 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసి దిల్లీని కష్టాల్లోకి నెట్టాడు.
దిల్లీతో రంజీ మ్యాచ్.. గెలుపు దిశగా ఆంధ్ర
దిల్లీతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు విజయం దిశగా సాగుతోంది. మూడోరోజు ఆట ముగిసేసరికి దిల్లీ జట్టు 6 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. విజయానికి 4 వికెట్ల దూరంలో ఆంధ్ర జట్టు ఉంది.
దిల్లీతో రంజీ మ్యాచ్.. గెలుపు దిశగా ఆంధ్ర