ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దిల్లీతో రంజీ మ్యాచ్.. ఆంధ్ర ఘనవిజయం - ఒంగోలులో రంజీ మ్యాచ్ ఆంధ్ర విజయం వార్తలు

ప్రకాశం జిల్లా ఒంగోలు శర్మ కళాశాల మైదానంలో దిల్లీతో జరుగిన రంజీ మ్యాచ్​లో ఆంధ్ర జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆంధ్ర బౌలర్లు శశికాంత్,  స్టీఫెన్ చెరో ఐదు వికెట్లు తీసుకుని దిల్లీ పతనంలో కీలకపాత్ర పోషించారు.

ranji match with delhi andhra won
గెలుపొందిన ఆంధ్ర జట్టు

By

Published : Dec 21, 2019, 9:47 AM IST

ప్రకాశం జిల్లా ఒంగోలు శర్మ కళాశాల మైదానంలో దిల్లీతో జరుగిన రంజీ మ్యాచ్​లో ఆంధ్ర జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడో రోజు రెండో ఇన్సింగ్​లో 89 పరుగులకు 6 వికెట్లు కోల్పోయిన దిల్లీ.. నాలుగోరోజు 169 పరుగులకు ఆలౌటైంది. 20 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆంధ్ర ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆంధ్ర బౌలర్లు శశికాంత్, స్టీఫెన్ చెరో ఐదు వికెట్లు తీసుకుని దిల్లీ పతనంలో కీలకపాత్ర పోషించారు. దిల్లీ బ్యాట్స్​మెన్ లలిత్ యాదవ్ అర్థ సెంచరీతో పోరాడినా.. జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయాడు.

ABOUT THE AUTHOR

...view details