ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం.. నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ గుండానికి వరద పోటెత్తింది. గత రెండు రోజులుగా నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షానికి.. భారీ స్థాయిలో గుండంలోకి నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రజలెవరూ గుండంలోకి దిగకుండా స్థానిక అధికారులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు.
రంగనాయక స్వామి ఆలయ గుండానికి పోటెత్తిన వరద - రంగనాయక స్వామి ఆలయ గుండానికి పోటెత్తిన వరద
ప్రముఖ పుణ్యక్షేత్రం రంగనాయక స్వామి ఆలయ గుండానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షపు నీరు ఇక్కడకు వచ్చి చేరడంతో.. గుండంలో నీటిమట్టం భారీగా పెరిగింది.
![రంగనాయక స్వామి ఆలయ గుండానికి పోటెత్తిన వరద heavy flood to ranganayaka gundam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11860875-698-11860875-1621694967579.jpg)
రంగనాయక స్వామి ఆలయ గుండానికి పోటెత్తిన వరద