ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్ఆర్సీకి మద్దతుగా ముస్లింల ర్యాలీ - ప్రకాశంలో ఎన్ఆర్సీకి మద్దతుగా ర్యాలీ

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లాలో ముస్లింలు చేపడుతున్న దీక్షకు మద్దతుగా సీపీఎం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా కేంద్ర హోంశాఖ గెజిట్​ను విడుదల చేయటాన్ని సవాలు చేస్తూ.. కడపలోని ముస్లిమ్ ఐకాస నాయకులు పలువురు నేతలకు లీగల్ నోటీసులిచ్చారు.

rally in prakasham district for nrc bill
ప్రకాశంలో ఎన్ఆర్సీకి మద్దతుగా ర్యాలీ, పలువురు నేతలకు లీగల్ నోటీసులు పంపించిన కడప ఐకాస నేతలు

By

Published : Jan 19, 2020, 2:58 PM IST

ప్రకాశం జిల్లా కనిగిరిలో పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ గత మూడు రోజులుగా ముస్లింలు దీక్ష చేస్తున్నారు. ముస్లింల దీక్షకు మద్దతుగా సీపీఎం ఆధ్వర్యంలో సుందరయ్య భవన్ నుంచి సుభాస్ రోడ్ మీదుగా దీక్షా శిబిరానికి ర్యాలీగా చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి సీపీఎం నాయకులు, ముస్లిం సోదరులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

పలువురు నేతలకు లీగల్ నోటీసులు పంపించిన కడప ఐకాస నేతలు

సుప్రీంకోర్టులో ఎన్​ఆర్సీ, ఎన్పీఆర్, సీఏఏ చట్టాలపై కేసులు పెండింగ్​లో ఉండగానే కేంద్ర హోంశాఖ గెజిట్​ను విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ కడప ముస్లిమ్ ఐకాస నేతలు లీగల్ నోటీసులు పంపించారు. హోం శాఖ సెక్రెటరీకి, అదనపు సెక్రెటరీకి, ఆర్బీఐ గవర్నర్​కు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారికి, ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శికి నోటీసులు పంపించారు. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలపై అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని వారు ఆరోపించారు. కేంద్రం మొండి వైఖరితో అవలంబిస్తున్న విధానాలను తక్షణం ఉపసంహరించుకోవాలని లేకపోతే రాజీలేని పోరాటానికి దిగుతామని ఐకాస నేతలు స్పష్టం చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details