విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు ఎందాకైనా వెళ్తామని ప్రకాశం జిల్లా దర్శి తెదేపా నేతలు చెప్పారు. నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ పమిడి రమేశ్ ఆధ్వర్యంలో.. పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. పరిశ్రమ పరిరక్షణ కోసం ఎటువంటి పోరాటాలకైనా సిద్ధమని రమేశ్ చెప్పారు.
'విశాఖ ఉక్కు పరిరక్షణకు ఎందాకైనా వెళ్తాం' - ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దర్శిలో నిరసన వార్తలు
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ప్రతిపాదనకు నిరసనగా ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ పమిడి రమేశ్ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడం కోసం ఎంతవరకైనా వెళతామని ఆయన అన్నారు.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు.. నినాదాలతో మార్మోగిన దర్శి ప్రధాన కూడళ్లు