ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతులను మోసగిస్తున్న రాజస్థాన్ ముఠా అరెస్ట్ - gang arrested for cheating farmers

రైతును మోసగించి 15 లక్షల విలువైన విత్తనాలతో పరారైన రాజస్థాన్ ముఠాను ప్రకాశం జిల్లా ఒంగోలు పోలుసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్​లో ట్రాన్స్ పోర్టు కార్యాలయాన్ని ఏర్పాటు చేసి నిందితులు ఈ విధమైన మోసాలకు పాల్పడుతున్నారు.

రైతులను మోసగిస్తున్న రాజస్థాన్ ముఠా అరెస్ట్

By

Published : Jun 25, 2019, 5:30 PM IST

రైతులను మోసగిస్తున్న రాజస్థాన్ ముఠా అరెస్ట్

లారీ ట్రాన్స్​పోర్టు పేరుతో రైతుని మోస‌గించి పిల్లిపెస‌ర విత్తనాల లోడుతో ప‌రారైన రాజ‌స్థాన్ ముఠాను ప్ర‌కాశం జిల్లా ఒంగోలు పోలీసులు అరెస్టు చేశారు. వారి వ‌ద్ద నుంచి 15 ల‌క్ష‌ల విలువ చేసే విత్తన లారీని స్వాధీనం చేసుకున్నారు. నాగులుప్ప‌ల‌పాడు మండ‌లం ఒమ్మెవ‌రం గ్రామం నుంచి తెలంగాణ రాష్ట్రంలోని ఖ‌మ్మం కోల్డ్ స్టోరేజీకి తీసుకువెళ్లాల్సిన లారీని డ్రైవర్ దారి మళ్లించి కృష్ణా జిల్లా నందిగామకు చెందిన వ్యాపారికి విక్ర‌యించాడు. హైద‌రాబాద్​లోని నాచారం కేంద్రంగా శివశక్తి అగ్రోసీడ్స్ పేరుతో కార్యాలయం నడుపుతున్న రాజస్ధాన్​కు చెందిన ముఠా ఇటువంటి నేరాల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. ముఠా స‌భ్యుల్లో సుమిత్ శ‌ర్మను నందిగామ వద్ద అదుపులోకి తీసుకోగా...మిగిలిన ముఠా సభ్యులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details