ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం రాజానగరంలో జరిగిన హత్యకేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్… విలేకరుల సమావేశంలో హత్యకు గల కారణాలను వెల్లడించారు. గత నెల 23వ తేదీ రాత్రి 7 గంటల సమయంలో తాళ్లూరు మండలం రాజానగరం గ్రామంలో... గ్రామ పెద్దల్లో ఒకరైన మారం సుబ్బారెడ్డి (60) తన ఇంట్లో టీవీ చూస్తుండగా... కోమటిగంట వెంకటేశ్వర్లు అనే వ్యక్తి సుబ్బారెడ్డిని గొంతుకోసి చంపి పారిపోయాడు.
అనవసరంగా మాట్లాడుతున్నాడని.. వృద్ధుడిని చంపేశాడు! - prakasham district crime news
ప్రకాశం జిల్లా రాజానగరం హత్యకేసు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. తన గురించి అనవసరంగా మాట్లాడుతున్నాడన్న కోపంతోనే హత్య చేసినట్లు నిందితుడు తెలిపినట్టు ఎస్పీ వివరించారు.
కేసు వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ
వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేయగా.. హత్య జరిగిన నాటినుంచి కోమటిగుంట వెంకటేశ్వర్లు కనిపించకుండాపోవడం అనుమానం కలిగించింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. తన గురించి అనవసరంగా మాట్లాడుతున్నాడన్న కోపంతోనే హత్య చేసినట్లు నిందితుడు తెలిపినట్టు ఎస్పీ వివరించారు.