ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని పలు మండలాల్లో జోరు వర్షం కురిసింది. కొరిసపాడు, పంగులూరు మండలాల్లో మిర్చి సాగు చేసిన రైతాంగాన్ని నష్టాలపాలు చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో కూలీ రేట్లు అధికంగా వెచ్చించి మిర్చి కోతలు జరిగాయని, అమ్ముకునేందుకు సరైన ధర కూడా రావడం లేదని రైతులు ఆందోళన చెందారు. దీనికి తోడు వర్షం కురవడం మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఉందని కన్నీళ్లు పెట్టుకున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు.
కరోనాతో కష్టాలు.. మరింత పెంచిన అకాల వర్షాలు - rains in ongle latest news update
ప్రకాశం జిల్లాలో అకాలంగా కురిసిన వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. కరోనా కారణంగా అధిక కూలీలు ఇచ్చి పంట సాగు చేస్తే.. గిట్టు బాటు ధర కూడా రాక అల్లాడుతున్నామన్నారు. ఇలాంటి పరిస్థితిలో.. అకాల వర్షాలు మరిన్ని కష్టాలు తీసుకొచ్చాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రకాశం జిల్లాలో అకాలంగా కురిసిన వర్షాలు