ప్రకాశం జిల్లా చీరాల, పర్చూరులోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. పర్చూరు పట్టణంలో గంటసేపు మోస్తరుగా వాన పడింది. చీరాలలో ఉదయం నుంచి ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఇప్పటికీ ఆకాశం మేఘావృతమై ఉంది. చల్లని గాలులు వీస్తున్నాయి. కొద్ది రోజులుగా ఎండల వేడిమితో ఇబ్బందులు పడుతున్న ప్రజలు… చల్లనిగాలులను ఆస్వాదిస్తున్నారు.
చీరాల, పర్చూరులో మోస్తరుగా వర్షం - చీరాల తాజావార్తలు
ప్రకాశం జిల్లా చీరాల, పర్చూరు ప్రాంతాల్లో వర్షం కురిసింది. వేసవి తాపానికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం... ఈ వానతో ఉపశమనం పొందుతున్నారు. ఉక్కపోత నుంచి బయటపడి.. చల్లనిగాలులను ఆస్వాదిస్తున్నారు.
![చీరాల, పర్చూరులో మోస్తరుగా వర్షం rain](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-08:28:09:1621133889-ap-ong-42-16-chirala-rain-av-ap10068-16052021075917-1605f-1621132157-1033.jpg)
చీరాలలో కురిసిన వర్షం