బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా ప్రకాశం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారుజాము నుంచి చీరాల, వేటపాలెం, పర్చూరు, యద్దనపూడి, మార్టూరు, ఇంకొల్లు, చినగంజాం, దర్శి ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి చీరాల పట్టణంలోని రహదారులపై వర్షపు నీరు చేరింది. దీంతో పట్టణ ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. డ్రైనేజి కాలువలల్లో పూడిక తీస్తే రహదారులపై నీరు నిలవదని పట్టణవాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సోమవారం పలు ప్రాంతాల్లో వర్షం ఏకధాటిగా కురిసింది. ఇంకొల్లులో 37.5, వేటపాలెంలో 29.5 మి. మీటర్ల చొప్పున వర్షపాతం నమోదయింది.