దిల్లీలో రైతుల ఉద్యమానికి మద్దతుగా ప్రకాశం జిల్లా ఒంగోలులో రైతులు రైలు రోకో నిర్వహించారు. రైల్వే స్టేషన్ బయట నిరసన చేపట్టారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని.. దిల్లీలో పెద్దఎత్తున ధర్నా నిర్వహిస్తున్నా.. కేంద్రం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రెండు వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కిసాన్ సంఘం, వామపక్షాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఒంగోలులో రైతన్నల రైలు రోకో.. వ్యవసాయ చట్టాల రద్దుకు డిమాండ్ - agriculture acts latest news
ప్రకాశం జిల్లా ఒంగోలులో రైతులు రైలు రోకో నిర్వహించారు. రెండు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఒంగోలులో రైతన్నల రైలు రోకో