ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మార్కాపురంలో రెండు ఆటోలు ఢీ.. రైల్వే ఉద్యోగి మృతి - ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంలో రైల్వే ఉద్యోగి మృతి

ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీకొన్న ఘటనలో రైల్వే ఉద్యోగి మృతి చెందాడు. ఈ ప్రమాదం ప్రకాశం జిల్లాలో జరిగింది.

rail employee died in road accident in prakasham district
rail employee died in road accident in prakasham district

By

Published : Oct 27, 2021, 9:25 AM IST

ప్రకాశం జిల్లా మార్కాపురం చెరువుకట్టపై ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆంజనేయరెడ్డి అనే రైల్వే ఉద్యోగి మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. రాయవరం రైల్వే స్టేషన్ నుంచి మార్కాపురం వస్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న సుధా గ్యాస్​కు చెందిన ఆటో వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆంజనేయరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వద్ద ఉన్న రైల్వే ఐడి కార్డ్, ఆధార్ కార్డుల ప్రకారం ఆనంతరపురానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

చెరువుకట్టపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని వాహనదారులు చెబుతున్నారు. రహదారి విస్తరణ చేపట్టి ప్రమాదాలు నివారించాలని వారు కోరుతున్నారు.

ఇదీ చదవండి: pds rice scam: కైకలూరు ఎంఎల్ఎస్ పాయింట్​లో భారీ కుంభకోణం.. రూ. కోటి విలువైన​ బియ్యం మాయం

ABOUT THE AUTHOR

...view details