ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎమ్మెల్యే రాంబాబు, మాజీ ఎంపీ ప్రతాప్ రెడ్డి మధ్య వాగ్వాదం - కంభం తాజా వార్తలు

ప్రకాశం జిల్లా కంభం మండలంలో.. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, నంద్యాల మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసే విషయంలో ఇరువురు వాగ్వాదానికి దిగారు.

quarrel between giddaluru mla and nandyala ex mp in prakasam district
గిద్దలూరు ఎమ్మెల్యే రాంబాబు, నంద్యాల మాజీ ఎంపీ ప్రతాప్ రెడ్డి మధ్య వాగ్వాదం

By

Published : Dec 14, 2020, 7:10 PM IST

గిద్దలూరు ఎమ్మెల్యే రాంబాబు, నంద్యాల మాజీ ఎంపీ ప్రతాప్ రెడ్డి మధ్య వాగ్వాదం

ప్రకాశం జిల్లా కంభం మండలం కంభం చెరువు కట్టపైన మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ కందుల నాగార్జున రెడ్డి జయంతి కార్యక్రమంలో.. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, నంద్యాల మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. ప్రభుత్వం రాయలసీమపై నిర్లక్ష్యం చూపుతోందని, గ్రేటర్ రాయలసీమ ఇవ్వాల్సిందేనని.. గంగుల ప్రతాప్‌రెడ్డి డిమాండ్ చేశారు.

వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతాప్‌రెడ్డి వ్యాఖ్యలను విభేదించిన ఎమ్మెల్యే అన్నా రాంబాబు.. వెలిగొండను పూర్తి చేసి 2021 నాటికి రాయలసీమను కరవు పీడిత ప్రాంతంగా మారుస్తామని బదులిచ్చారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details