విషాన్ని చిమ్మడంలో కాస్త వెనకేే ఉంటుందేమోగానీ.. తన ఆకారంతో జనాన్ని భయపెట్టడంలో మాత్రం ముందు వరసలోనే ఉంటుంది కొండచిలువ. భారీ పొడవుతో భయంకరంగా కనిపించే.. ఈ పామును చూస్తే ఎవరికైనా గుండెలు జారిపోవాల్సిందే. అలాంటి కొండచిలువ ప్రకాశం జిల్లా మార్టూరు మండలం కోలలపూడి గ్రామస్తులను హడలెత్తించింది.
గ్రామానికి కూతవేటు దూరంలో ఉన్న సాగర్ కాలువ దగ్గరలో సుమారు పది అడుగుల కొండ చిలువ ప్రయాణికుల కంటపడింది. కొండచిలువ కనిపించిన సమీపంలోనే పశువుల పాక ఉంది. అందులో గొర్రెల మంద ఉండటంతో.. జీవాల పోషకులు ఆందోళనకు గురయ్యారు. రాత్రంతా గొర్రెలను చూసుకుంటూనే కూర్చున్నారు.