ప్రకాశం జిల్లా కనిగిరి పోలీస్‌స్టేషన్‌ను పుణుగోడు గ్రామస్థులు ముట్టడించారు. అక్రమంగా కేసులు బనాయిస్తూ రాజకీయ కక్షతో ఒక వర్గానికే పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఠాణా ఎదుట బైఠాయించారు. అన్నదమ్ముల మధ్య పొలం తగాదా విషయంలో పోలీసులు జోక్యం చేసుకుని.. రాజకీయ జోక్యంతో అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని.. అకారణంగా స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ పేరుతో మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారంటూ ఆరోపించారు.
కనిగిరి పోలీస్‌స్టేషన్ ఎదుట పుణుగోడు గ్రామస్థుల ఆందోళన
కనిగిరి పోలీస్‌స్టేషన్‌ను పుణుగోడు గ్రామస్థులు ముట్టడించారు. గ్రామానికి చెందిన సుమారు 70 మంది పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు తీరు మార్చుకోవాలని, అక్రమంగా అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పుణుగోడు గ్రామస్థుల ఆందోళన
గ్రామానికి చెందిన సుమారు 70 మంది పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు తీరు మార్చుకోవాలని,.. అక్రమంగా అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ... బైపోల్: గెలుపే లక్ష్యంగా సర్వశక్తులూ ఒడ్డుతున్న పార్టీలు