ప్రకాశం జిల్లా పుల్లలచెరువులోని బస్టాండ్ సెంటర్ వద్ద రాత్రి కర్ఫ్యూ సమయంలో బయటకు వచ్చిన పలువురికి ఎస్సై వి.సుధాకర్ కౌన్సెలింగ్ నిర్వహించారు. కర్ఫ్యూ సమయంలో అత్యవసరమైతేనే బయటకు రావాలన్నారు. కారణం లేకుండా బయట తిరిగితే వాహనాలు సీజ్ చేసి.. కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
'కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు' - కర్ఫ్యూ నిబంధనలపై పుల్లలచెరువు ఎస్సై కామెంట్స్
కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే.. కఠిన చర్యలు తప్పవని ప్రకాశం జిల్లా పుల్లలచెరువు ఎస్సై వి.సుధాకర్ అన్నారు. ఆంక్షల సమయంలో బయటకు వచ్చిన పలువురికి ఆయన కౌన్సెలింగ్ ఇచ్చారు.
!['కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు' 'కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11985610-292-11985610-1622609801536.jpg)
'కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు'