ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో రైతుల సమస్యలను పరిష్కరించాలని.. నియోజకవర్గ వైకాపా భాద్యుడు రావి రామనాధం బాబు మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను కోరారు.
ఎంతో కాలంగా పర్చూరు ప్రాంత రైతులు ఎదురుచూస్తున్న గుంటూరు ఛానల్ గురించి మంత్రికి వివరించారు. చెక్ డ్యాంలు, రైతుల పంట పొలాలు గురించి నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో ఆయన చర్చించారు.