ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తుప్పు పాలవుతున్న ప్రజాధనం.. నిర్లక్ష్యం పట్ల ప్రజల ఆగ్రహం - public assets damage at kanigiri

ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీలోని అధికారుల నిర్లక్ష్యమో.. లేక అశ్రద్ధో.. కానీ మొత్తానికి ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. పంచాయతీ పరిధిలో అవసరాల కోసం కొనుగోలు చేసిన పారిశుద్ధ్య యంత్రాలు నానాటికి మూలకు చేరతున్నాయి. తుప్పు పట్టి పోతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం పట్ల గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

public assets damage at kanigiri
తుప్పు పాలవుతున్న ప్రజాధనం.

By

Published : Jan 19, 2021, 6:54 PM IST

ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీలోని ప్రభుత్వం కొనుగోలు చేసిన పారిశుద్ధ్య యంత్రాలు తుప్పు పట్టిపోయి మూలకు చేరుతున్నాయి. ప్రజాధనం తుప్పు రూపంలో వృథా అవుతున్నా.. పట్టించుకునే నాథుడే లేడని గ్రామస్థులు వాపోతున్నారు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం.. పంచాయతీలో మురుగు కాలువల్లో చెత్త తొలగించేందుకు అత్యవసరంగా ఉపయోగించే మినీ జేసీబీ యంత్రాని కొనుగోలు చేసింది. నిత్యం పారిశుద్ధ్యానికి ఉపయోగపడే ఈ వాహనం అధికారుల నిర్లక్ష్యమో..లేక అశ్రద్ధో.. కానీ నేడు నిరుపయోగంగా మారాయి. తుప్పుపట్టి మూలకు చేరాయి. దీంతో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులకు ప్రజాధనం దుర్వినియోగంపై ఇంత నిర్లక్ష్యం తగదని పలువురు స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మూలనపడ్డ యంత్రాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details