ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Psycho: సైకో వీరంగం... గొడ్డలితో ఇద్దరిపై దాడి... ఎక్కడంటే..? - ప్రకాశం జిల్లా తాజా వార్తలు

Psycho: ప్రకాశం జిల్లా దోర్నాల మండలం యడవల్లిలో సైకో వీరంగం సృష్టించాడు. గొడ్డలి పట్టుకుని రహదారిపై వెళ్తూ ఇద్దరు వ్యక్తులపై దాడి చేశాడు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్​ పోలీస్‌స్టేషన్‌ వద్ద బాధితుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

Psycho
సైకో వీరంగం

By

Published : Oct 7, 2022, 1:57 PM IST

Psycho: ప్రకాశం జిల్లా దోర్నాల మండలం యడవల్లిలో శ్రీనివాస్ అనే వ్యక్తి గొడ్డలితో వీరంగం సృష్టించాడు. గొడ్డలి పట్టుకుని.. రహదారిపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులపై దాడికి తెగపడ్డాడు. ఈ ఘటనలో నల్లబోతుల రమణయ్య, ముగయ్యల తలలపై తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నిందితుడు శ్రీనివాస్ గ్రామంలో మద్యం తాగుతూ జులాయిగా తిరుగుతూ ఉంటాడని గ్రామస్థులు తెలిపారు. మరోవైపు నిందితుడు శ్రీనివాస్​ను కఠినంగా శిక్షించాలని పోలీస్ స్టేషన్ ఎదుట బాధితుల కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. నిందితుడ్ని ఊరిలోకి రానివ్వకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.

ABOUT THE AUTHOR

...view details