లారీ ప్రమాదానికి సంబంధించి బీమా కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ.. ఓ పోలీస్ హెడ్ కానిస్టేబుల్.... అనిశాకు పట్టుబడ్డాడు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం పోలీస్ స్టేషన్లో వీర్రాజు.... హెడ్ కానిస్టేబుల్, రైటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. విజయవాడకు చెందిన ఓ లారీ గత ఆదివారం మద్దిపాడు మండలంలో ప్రమాదానికి గురయ్యింది. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. లారీ యజమాని బీమా కోసం ప్రమాదంపై ధ్రువీకరణ పత్రం అడగ్గా.... 5 వేలు లంచం ఇస్తే పత్రం ఇస్తానని వీర్రాజు తెలిపాడు. లారీ డ్రైవర్ అనిశా అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఇవాళ హెడ్ కానిస్టేబుల్ వీర్రాజు లంచం తీసుకుంటుండగా అనిశా అధికారులు పట్టుకున్నారు.
లంచం అడిగాడు.. అనిశాకు చిక్కాడు - prakasham district latest acb news
ఓ ధృవీకరణ విషయంలో లంచాన్ని కోరిన హెడ్ కానిస్టేబుల్.. అవినీతి నిరోధక శాఖ సిబ్బందికి చిక్కారు.

ప్రకాశం జిల్లా మద్దిపాడు హెడ్‌కానిస్టేబుల్...అ.ని.శాకు చిక్కాడు
ప్రకాశం జిల్లా మద్దిపాడు హెడ్‌కానిస్టేబుల్...అ.ని.శాకు చిక్కాడు
ఇవీ చూడండి