వేటపాలెంలో దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని నిరనస - Handicapped protest to fix problems
దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ... ప్రకాశం జిల్లా వేటపాలెంలో నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
ప్రకాశం జిల్లా వేటపాలెంలో నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేశారు. దివ్యాంగుల చట్టం 2016 ప్రకారం సమస్యలను పరిష్కరించాలని... వారిని ఆదుకోవాలని.. దివ్యాంగుల సంఘం ప్రతినిధి రమేష్ అన్నారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో కుటుంబాలను పోషించుకోలేక... ఇబ్బందులు పడుతున్నామని... ప్రభుత్వం సహాయం అందించాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం చీరాల కార్యదర్శి బాబురావు మండలంలోని దివ్యాంగులు పాల్గొన్నారు. అనంతరం ఎంపీడీఓ నేతాజీకి వినతి పత్రం అందజేశారు.