మధ్యాహ్న భోజన పథకాన్ని ఏక్తా శక్తి ఫౌండేషన్‌కు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయం మందు మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా నిర్వహించారు. జిల్లాలో కొన్ని పాఠశాలలను ఈ సంస్థకు అప్పగించారని, మరికొన్ని కార్మికులు నిర్వహిస్తున్నారన్నారు. అదే విధంగా గత మూడు నెలలుగా తమకు రావలసిన బకాయిలు చెల్లించాలని, పెంచిన వేతనాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులు కలెక్టర్ కార్యాలయంలోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.
కలెక్టరేట్ వద్ద మధ్యాహ్న భోజన కార్మికుల ఆందోళన - కలెక్టరేట్ వద్ద మధ్యాహ్న భోజన కార్మికుల ఆందోళన
ప్రకాశం జిల్లా కలెక్టరేట్ వద్ద... మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా నిర్వహించారు. భోజన పథకాన్ని ఏక్తా శక్తి ఫౌండేషన్‌కు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ...నినాదాలు చేశారు.
కలెక్టరేట్ వద్ద మధ్యాహ్న భోజన కార్మికుల ఆందోళన