అమరావతి ఉద్యమానికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా... ప్రకాశం జిల్లా అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఒంగోలులో భారీ ప్రదర్శన నిర్వహించారు. కర్నూలు రోడ్డు పైవంతెన నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఎడ్లబండ్లు, మోటారు సైకిళ్లతో నిరసన చేశారు. మూడు రాజధానుల ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని జిల్లాల ప్రజలకు అమరావతి అనుకూలంగా ఉందని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అమరావతి ఉద్యమానికి మద్దతు.. ఒంగోలులో భారీ ర్యాలీ - ఒంగోలులో ఆందోళన
ప్రకాశం జిల్లా ఒంగోలులో అమరావతి ఉద్యమానికి మద్దతుగా భారీ ర్యాలీ చేపట్టారు. మూడు రాజధానుల అంశాన్ని ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేశారు.
అమరావతి ఉద్యమానికి మద్దతుగా ఒంగోలులో భారీ ర్యాలీ