ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెట్రోల్, గ్యాస్ ధరల పెంపుపై నిరసన - kanigiri latest news

ప్రకాశం జిల్లా కనిగిరిలో సీపీఎం ఆధ్వర్యంలో స్థానికులు నిరసన చేపట్టారు. పెంచిన గ్యాస్, పెట్రోల్ ధరలను నిరసిస్తూ... గ్యాస్ సిలిండర్లను నెత్తిన పెట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ధరలను తగ్గించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామన్నారు.

protest in kanigiri to demand decrease petrol, gas prices
పెరిగిన పెట్రోల్, గ్యాస్ ధరలను నిరసిస్తూ నిరసన

By

Published : Feb 21, 2021, 9:38 PM IST

పెట్రోల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ... ప్రకాశం జిల్లా కనిగిరిలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. గ్యాస్ సిలిండర్లను నెత్తిన పెట్టుకుని పట్టణ ప్రధాన రహదారులలో మహిళలు ర్యాలీ చేపట్టారు. పెట్రోల్, గ్యాస్ ధరలను పెంచి ప్రజలపై భారం మోపడం దారుణమని అన్నారు.

ప్రజలకు ప్రయోజనం కలిగించేలా సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఇప్పటికైనా పెరిగిన ధరలను తగ్గించకపోతే... ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details