ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కేంద్ర విధానాలను నిరసిస్తూ ఏఐటీయూసీ, వామపక్షాల ధర్నా

కేంద్రం రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ ఏఐటీయూసీ, వామపక్ష పార్టీలు నిరసన చేపట్టాయి. 22 రోజులుగా ఎముకలు కొరికే చలిలో అన్నదాతలు దీక్ష చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోవడం దారుణమని నేతలు విమర్శించారు.

prortest
తహసీల్దార్​ కార్యాలయం ఎదుట ధర్నా

By

Published : Dec 22, 2020, 2:04 PM IST

రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ... ప్రకాశం జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. దిల్లీలో గత ఇరవై రెండు రోజులుగా రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలంటూ ఎముకలు కొరికే చలిలో ధర్నా చేస్తుంటే ఏ మాత్రం దిగిరాని కేంద్ర ప్రభుత్వం తీరు దారుణమన్నారు.

కార్పొరేట్ల హస్తాల్లో వ్యవసాయ రంగాన్ని పెట్టే విధానాన్ని వామపక్ష, ప్రజాసంఘాల నాయకులు దుయ్యబట్టారు. కార్యక్రమంలో వామపక్ష నేతలు అచ్యుతుని బాబూరావు, బీరక పరమేష్, బత్తుల శామ్యూల్, వూటుకూరి వెంకటేశ్వర్లు సిద్దాబత్తుని సూర్యప్రకాసరావు, మోహన్ కుమార్ ధర్మా, మాచర్ల మోహన్ రావు, మేడ వెంకట్రావు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details