మద్యం దుకాణాలకు వ్యతిరేకంగా ప్రకాశం జిల్లా కనిగిరిలో ఐద్వా, సీపీఎం నిరసన చేపట్టింది. లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరిచి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మద్యం దుకాణాలు మూసివేయాలని డిమాండ్ చేశారు. శుభకార్యాలకు పరిమిత సంఖ్యలో జనానికి అనుమితి ఇస్తున్న ప్రభుత్వం.. మద్యం దుకాణాల వద్దకు వేలాది మందికి ఎలా అనిమతి ఇస్తుందని ప్రశ్నించారు.
మద్యం దుకాణాలకు వ్యతిరేకంగా ఐద్వా, సీపీఎం నిరసన - కనిగిరిలో మహిళల ధర్నా
మద్యం దుకాణాలను మూసివేయాలని డిమాండ్ చేస్తూ ఐద్వా, సీపీఎం నిరసన చేపట్టాయి. ప్రకాశం జిల్లా కనిగిరిలో ధర్న నిర్వహించాయి.
మద్యం దుకాణాలకు వ్యతిరేకంగా ఐద్వా, సీపీఎం నిరసన
TAGGED:
కనిగిరిలో మహిళల ధర్నా