ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా కనిగిరి కేవీపీస్, ఏఐఏడబ్ల్యూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. స్థానిక ఒంగోలు బస్టాండ్ కూడలిలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు.
దళితులపై దాడులకు పాల్పడితే సహించబోమని.. అలాంటి వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం దళితులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని.. తన పద్ధతి మార్చుకోకపోతే దళితుల వ్యతిరేక ప్రభుత్వమని భావించాల్సి వస్తుందని హెచ్చరించారు.