ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో రెండో విడత పూర్తయిన నామినేషన్ల ప్రక్రియ - Prakasam district newsupdates

ప్రకాశం జిల్లాలో రెండో విడత ఎన్నికలకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేశారు. తొలి రెండు రోజుల కన్నా.. మూడోరోజు చాలాచోట్ల నామినేషన్లు వేసేందుకు పోటీ పడ్డారు.. రెండో విడతలో దర్శి, అద్దంకి నియోజకవర్గాలతో పాటు కొండెపి, మార్కాపురంలో నియోజకవర్గాల్లో కొన్ని మండలాలు వెరసి 14 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

Process of nominations completed in the second installment in Prakasam district
ప్రకాశం జిల్లాలో రెండో విడత పూర్తయిన నామినేషన్ల ప్రక్రియ

By

Published : Feb 5, 2021, 8:46 PM IST

ప్రకాశం జిల్లాలో నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తుండగా తొలివిడత ఎన్నికల హడావుడి జోరందుకుంది. పోటీకి బరిలో నిలిచే అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. ఇక రెండో విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది.

రెండో విడత 14 మండలాల్లో 277 పంచాయతీలు, 2760 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి రెండు రోజులు మందకొడిగా నామినేషన్లు వేసినా.. మూడో రోజు పోటాపోటీగా దాఖలు చేశారు. మండ్లమూరు, మర్రిపూడి వంటి ప్రాంతాల్లో అర్థరాత్రి వరకు నామినేషన్లు వేసేందుకు వరుసలు కట్టారు.

రెండోవిడతలో మొత్తం 1625 మంది సర్పంచులు, 5966 మంది వార్డు సభ్యులు నామినేషన్లు వేశారు. అత్యధికంగా సర్పంచి పదవులకు దర్శి మండలంలో 149 మంది, కొనకొనమెట్ల మండలంలో 154, అద్దంకి మండలంలో 166 నామినేషన్లు వేశారు.

ఇదీ చదవండి:

'రాష్ట్ర ప్రభుత్వ దారి ఎటు.. భాజపా వైపా? రాజ్యాంగం వైపా?'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details