ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వంతెన కథ అంతేనా? - చీరాల రైల్వేరోడ్ ఓవర్​ బ్రిడ్జి వార్తలు

ప్రకాశం జిల్లా చీరాలలోని రైల్వై రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జిపై సమస్యలు తిష్ఠవేశాయి. రవాణాలో కీలకమైన ఈ వంతెన మరమ్మతులకు నోచుకోవడం లేదు. తరచుగా జరుగుతున్న ప్రమాదాలు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. వంతెన గోడలు బీటలు వారుతున్నా, విద్యుద్దీపాలు పనిచేయకపోయినా పట్టించుకునేవారే లేరంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Problems on chirala Railway Road Overbridge in Prakasam District
ప్రకాశం జిల్లా చీరాలలోని రైల్వై రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జిపై సమస్యలు

By

Published : Jun 10, 2020, 4:35 PM IST

ప్రకాశం జిల్లా చీరాలలోని రైల్వే ఓవర్‌ బ్రిడ్జిని... 6.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి... రెండు దశాబ్దాల క్రితం అప్పటి పాలకులు, అధికారుల ప్రణాళికలకు కార్యరూపం ఇది. వాడరేవు - నరసరావుపేట - పిడుగురాళ్ల రహదారిలో.... చీరాల బస్టాండ్ రోడ్డు నుంచి కారంచేడు గేటు వరకు దీనిని నిర్మించారు. చీరాల నుంచి పర్చూరు, చిలకలూరిపేట, గుంటూరుకు వెళ్లేవారు ఈ వంతెన పై నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యమున్న ఈ వంతెన ప్రస్తుతం ప్రమాదాలకు నెలవుగా మారింది. చూసేందుకు రంగులతో ఆకట్టుకునేలా ఉన్నా... లోతుగా పరిశీలిస్తే సమస్యలే దర్శనమిస్తున్నాయి.

రెండేళ్ల క్రితం వంతెనకు మరమ్మతులు చేసి.... రంగులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. అప్పటి నుంచి దీనిని ఎవరూ పట్టించుకోలేదు. వంతెనపై రహదారి దెబ్బతిని గుంతలు ఏర్పడ్డాయి.

ప్రమాదాలకు నెలవు...

వాహనాలు అదుపుతప్పి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. వంతెనపై ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలు పనిచేయడం లేదు. ఆ విద్యుత్‌ తీగలను మెలితిప్పి అలాగే వదిలేశారు. వంతెన గోడలకు పిచ్చిమొక్కలు పెరిగి..... బీటలు వారేలా చేస్తున్నాయి. హెచ్చరిక బోర్డులు కూడా లేకపోవడం ప్రమాదాలకు కారణంగా మారిందని స్థానికులు చెబుతున్నారు.

అధికారులు సకాలంలో స్పందించకపోతే.... రైల్వే ఓవర్‌ బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకునే ప్రమాదముందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

ఇదీ చదవండి:'పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం'

ABOUT THE AUTHOR

...view details