ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల గ్రామానికి చెందిన దార్ల దీక్షిత్‌కు.. కరోనా సోకింది. పరిస్థితి విషమించడంతో దీక్షిత్‌ను కుటుంబసభ్యులు బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించిన వైద్యులు... ఊపిరితిత్తులు 70 శాతం చెడిపోయాయని, చికిత్స కోసం రూ.24 లక్షలు ఖర్చవుతాయని తెలిపారు.
ఊహించని ఈ ఘటనతో దీక్షిత్ కుటుంబీకులు హతాశులయ్యారు. వైద్యం కోసం అంత డబ్బు చెల్లించలేమని, దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని దీక్షిత్ తల్లి దార్ల హేమలత కన్నీటి పర్యంతమయ్యారు. సాయం చేయాలనుకునే వారు 8790271408 నంబర్‌కు ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేశారు.