ప్రకాశం జిల్లాలో కావలసినంత భూమి ఉన్నప్పటికీ అది వ్యవసాయానికి అనుకూలంగా లేదు. ఈ నేపథ్యంలో.. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఒంగోలుకు సమీపాన మద్దిపాడు మండలం గుండ్లపల్లి వద్ద గ్రోత్ సెంటర్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సుమారు 14 వందల 40ఎకరాల్లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వందల ఎకరాల్లో గ్రోత్ సెంటర్ని ప్రారంభించారు. కానీ మౌళిక సదుపాయల కల్పనలో ఆంధ్ర ప్రదేశ్ పారిశ్రామిక మౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఐఐసీ) శ్రద్ధ చూపడం లేదని విమర్శలున్నాయి.
ఇప్పటికీ ఇక్కడ డ్రైనీజీ వ్యవస్థ లేదు. గ్రానైట్ వ్యర్థాలు పారబోయడానికి డంపింగ్ యార్డు ఏర్పాటు చేయలేదు. వ్యర్థాలను ఎక్కడబడితే అక్కడ పారబోయడం వల్ల నేల కలుషితమవడమే కాకుండా వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. గ్రోత్ సెంటర్ ఆవరణలో 25శాతం మేర పచ్చదనం కోసం చెట్లు పెంచాల్సి ఉన్నా ఒక్క మొక్క కూడా కనిపించడం లేదు.