Problems with Electrical Poles: ప్రకాశం జిల్లా కనిగిరిలో విద్యుత్ స్తంభాలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి గోడలకు ఆనుకునే విధింగా ఉన్న విద్యుత్ తీగలతో భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటికి అడ్డంగా ఉన్న కరెంట్ స్తంభాలతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ స్తంభాలను సురక్షిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసి తమ ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నారు.
అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తీసి ఇతర ప్రాంతాల్లో ఏర్పాట చేయాలని.. ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇంటి ప్రధాన గేటుకు అడ్డంగా కరెంట్ స్తంభాలను విద్యుత్‌శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. మరి కొన్ని ప్రదేశాలలో అయితే ఏకంగా ఇంట్లోనే ఏర్పాటు చేశారు. విద్యుత్ స్తంభాలను తీసి ఇతర ప్రాంతాలలో విద్యుత్ చార్జీల మోత.. బిల్లు కట్టడం ఆలస్యం అయితే చాలు నిర్ధాక్షణంగా కనెక్షన్ తొలగిస్తారు.
కానీ వారి తప్పిదాలు మాత్రం ప్రజలు గుర్తు చేస్తున్నప్పటికీ విద్యుత్ అధికారులు మాత్రం కనికరం చూపడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏడాదిలో పలుమార్లు విద్యుత్ ప్రమాదాల కారణంగా అనేక మంది ప్రాణాలను విడుస్తున్నప్పటికీ విద్యుత్ అధికారులలో మాత్రం మార్పు కనబడడం లేదంటున్నారు.
ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో విద్యుత్ స్తంభాలు ఇంటి ఆవరణలో ఉండడం దానికి తోడు విద్యుత్ తీగలు పెద్దపెద్ద భవనాలను ఆనుకొని ప్రమాదకరంగా ఉండడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా ఇంటి వాకిళ్లకి అడ్డంగా స్తంభాలు ఉండడంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యుత్ స్తంభాలు ఇళ్లలో ఉండడానికి తోడు విద్యుత్ తీగలు భవనాలకు అనుకుని ప్రమాదకరంగా స్థానికులు భయపడేలా ఎప్పుడు ఎటు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
కొందరైతే కర్రలను విద్యుత్ తీగల కు సపోర్టుగా పెట్టి తమ భవనాలకు దూరంగా జరిపి ఉంచుతున్నారు. ఆదివారం వచ్చిందంటే చాలు చిన్నారుల తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురవుతూ చిన్నారులు డాబాపైకి ఆడుకుంటూ వెళ్లి ఆ విద్యుత్ తీగలను ఎక్కడ పట్టుకుంటారో ఏమోనని ఎటు నుండి ప్రమాదం ముంచుకొస్తుందోనని కనిగిరి పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి సమస్య ఆత్మకమైన స్తంభాలను, విద్యుత్ తీగలను సరిచేయాలని స్థానికులు కోరుతున్నారు.
నివాస భవనాలను తాకుతున్న విద్యుత్ తీగలు ఇవీ చదవండి: