ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సమస్య పరిష్కారించే వరకు పన్నులు కట్టేది లేదు'

​తీసుకున్న వస్త్రాలకు చెల్లించాల్సిన నగదు అడిగినందుకు వస్త్రవ్యాపారిపై కేసు పెట్టింది ఓ అధికారిని. వివరాలు తెలుసుకోకుండా అయన్ని పోలీసులు..స్టేషన్​కు తీసుకెళ్లి విచారించడం వివాదమైంది. దీంతో ప్రకాశం జిల్లా చీరాలలోని మమహాత్మాగాంధీ వస్త్రదుకాణాల సముదాయం వ్యాపారులు దుకాణాలు మూసివేసి బంద్ నిర్వహించారు.

సమస్య పరిష్కారించే..వరకు పన్నులు కట్టామని..వస్త్ర వ్యాపారులు

By

Published : Aug 29, 2019, 10:33 AM IST

చీరాల పోలీస్ స్టేషన్​ ముందు వస్త్ర వ్యాపారుల ఆందోళన ప్రకాశంజిల్లా చీరాలలో మాధురి అనే మహిళ కొన్నేళ్ల క్రితం స్థానిక ఎంజీసీ మార్కెట్లోని ఓ దుకాణంలో వస్త్రాలు కొనుగోలు చేశారు. వాణిజ్య పన్నుల శాఖలో పని చేసే ఈమె తన పరపతి ఉపయోగించి... తర్వాత నగదు చెల్లిస్తానని చెప్పి వెళ్లిపోయింది. కాలం గడుస్తున్నా... నగదు చెల్లించకపోవడంతో... ఆమె పని చేసే కార్యాలయానికి వెళ్లాడు దుకాణ యజమాని లీలానంద్‌. తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని అడిగాడు. కార్యాలయానికి వచ్చి తన పనికి భంగం కలిగించాడని అతనిపై మాధురి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వస్త్ర వ్యాపారి లీలానంద్​ను పోలీస్ స్టేషన్​కు తీసుకొచ్చారు.విషయం తెలుసుకునేందుకు వ్యాపారుల సంఘం వెళ్లగా పోలీస్ స్టేషన వద్ద పోలీసులు దురుసుగా ప్రవర్తించారని... అందువల్ల తాము దుకాణాలు మూసివేసి బందు చేస్తున్నామని వ్యాపారులు తెలిపారు... సమస్య పరిష్కరించే వరకు పన్నులు చెల్లించమని చీరాల చాంబరాఫ్ కామర్స్ అధ్యక్షుడు తులాబందు సురేష్ బాబు చెప్పారు.విషయం తెలుసుకున్న ఎమ్మెల్లే కరణం బలరామకృష్ణమూర్తి లీలానంద్​పై పోలీసులు పెట్టిన అక్రమకేసు గురించి జిల్లా ఎస్పీ తో మాట్లాడానని..వ్యాపారులకు అండగా ఉంటామన్నారు.

సమస్య పరిష్కారించే..వరకు పన్నులు కట్టామని..వస్త్ర వ్యాపారులు

ABOUT THE AUTHOR

...view details