ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకుల యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రకాశం జిల్లా యర్రగొండపలెంలోని నెహ్రు యువ కేంద్రంలో ప్రైవేట్ ఉపాధ్యాయులు ఒకరోజు నిరాహారదీక్ష చేపట్టారు. కరోనా మహమ్మారి వలన గత 5 నెలల నుంచి పాఠశాలలు, కళాశాలలు మూతపడినందున తమ జీవితాలు దుర్భరంగా మారాయన్నారు. జీతాలు లేక కుటుంబాలను పోషించుకోలేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. పాఠశాలల యాజమాన్యాలు పనిచేసిన కాలానికే జీతాలు అందించి.. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు జీతాలు ఇవ్వలేదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక వర్గాలకు ఆసరాగా ఆర్థిక సాయం చేసిన విధంగానే తమనూ ఆదుకోవాలని ప్రైవేట్ ఉపాధ్యాయులు కోరారు.
జీతాలివ్వాలని ప్రైవేట్ ఉపాధ్యాయుల నిరాహార దీక్ష - Private teachers' hunger strike to demand pay salaries
ప్రైవేటు పాఠశాల, కళాశాలల యాజమాన్యాలు ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ జీతాలివ్వకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులు ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు.
యాజమాన్యాలు జీతాలివ్వాలని ప్రైవేటు ఉపాధ్యాయుల నిరాహార దీక్ష