ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసే టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ప్రైవేటు లెక్చరర్ అండ్ యూనియన్ నియోజకవర్గ కన్వీనర్ గుమ్మా రాజయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
'ఆర్థిక సాయం చేసి ప్రభుత్వం ఆదుకోవాలి' - teachers union protest in Yarragondapalem
ప్రైవేట్ ఊపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రైవేటు లెక్చరర్ అండ్ యూనియన్ నియోజకవర్గ కన్వీనర్ గుమ్మా రాజయ్య డిమాండ్ చేశారు. తమకు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలంటూ ఆందోళన చేపట్టారు.
private teacher union
తెలంగాణ ప్రభుత్య తరహాలో ఈ రాష్ట్రంలో కూడా ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలన్నారు. కరోనా కారణంగా పాఠశాలలు, కళాశాలలు మూతపడిపోవడంతో తాము జీవనోపాధి కోల్పోయామన్నారు. ఈ విద్యా సంవత్సరంలో కూడా కరోనా సెకండ్ వేవ్ రూపంలో మమ్మల్ని కాటేసిందన్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం తహసీల్దార్, మండల విద్యాశాఖాధికారికి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
ఇదీ చదవండీ…కరోనాను వదలటం లేదు.. సైబర్ కేటుగాళ్లు!