ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట సమీపంలో వేకువజామున ప్రమాదం చోటుచేసుకుంది. కల్వర్టును ఢీకొని ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలను చేపట్టారు. బాధితులను గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ఉన్నట్లు సమాచారం. బస్సు కర్నూలు నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రకాశం జిల్లాలో ప్రైవేట్ బస్సు బోల్తా - Private bus overturns in Prakasam district Private bus overturns in Prakasam district newsupdates
కర్నూలు నుంచి విజయవాడకు వెళ్తున్న ప్రైవేటు బస్సు కల్వర్టును ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట సమీపంలో జరిగింది.
ప్రకాశం జిల్లాలో ప్రైవేట్ బస్సు బోల్తా