ఎగువన కురిసిన వర్షాలకు ఈ ఏడాది రాష్ట్రంలో జలాశయాలన్నీ నిండాయి. రైతన్నలు ఊపిరి పీల్చుకొని సాగుకు సమాయత్తమయ్యారు. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు నీటిని విడుదల చేస్తున్నామని అధికారికంగా ప్రకటించలేదు. వరి సాగుకు నీరు వస్తుందనే భరోసాతో నారుమళ్లుసిద్ధం చేస్తున్నారు. ఇటీవల జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో ఉన్నతధికారులు, కలెక్టర్ సాగు నీరు ఆరుతడులకే మాత్రమే వస్తుందని అన్నారు. కానీ రైతులు మాత్రం వరి నారుమళ్లు ఏర్పాటు పనులు వేగంగా చేస్తున్నారు.
నారుమళ్లతో రైతులు సిద్ధం - prakasam dist
ప్రకాశం జిల్లాలో ఈ ఏడాది కురిసిన వర్షాలకు రైతులు వరి సాగుకు నీరు వస్తుందని భరోసాతో నారుమళ్లు సిద్ధం చేశారు. కానీ ఉన్నతాధిాకారులు, కలెక్టర్... సమావేశంలో సాగు నీరు ఆరు తడులకే వస్తుందని అన్నారు.
నారుమళ్లతో రైతులు